వేద న్యూస్, బ్యూరో:

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా “ఆరె తెలంగాణ” జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ 2024 క్యాలెండర్ ను ఆ సొసైటీ అధినేత కోలె దామోదర్ రావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరె సామాజిక వర్గ ప్రజల చైతన్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఫిబ్రవరి 19 చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఆరెకుల బంధువులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.