వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి ఆర్మీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఆర్మీడేను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు తెలిపినారు. జనవరి 15 ను ఆర్మీ డేగా జరుపుతారని..దానికి అనుబంధంగా ( రెండో సైనిక దళం ఎన్ సి సి )రెండో ఆర్మీ సైన్యంగా ,సైనిక శక్తిగా పిలుస్తారని తెలిపారు. దేశభక్తి కి మారుపేరైన ఎన్సిసి క్యాడెట్..‘ఆర్మీ’ అనే పదంలోని అక్షరాలను అక్షరాల రూపంలో కూర్చొని అందరినీ అబ్బుర పరిచారు.
క్రమశిక్షణకు , దేశభక్తికి, ధైర్యసాహసాలకు మారుపేరు మన ఆర్మీ అని, ఒక బలమైన శక్తిగా ప్రపంచంలో 4వ స్థానంలో ఉందని ప్రిన్సిపాల్ వివరించారు. ఈ సందర్భంగా జరిపిన ఆర్మీ డే ను ఉద్దేశించి జాతీయ స్థాయి, క్విజ్ పోటీలను, వ్యాసరచన ముగ్గుల పోటీలను కూడా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్లను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ డాక్టర్ ఎం.సదానందం, డాక్టర్ కే రాజేందర్ రెడ్డి, సిహెచ్ రవీందర్, రాజమౌళి, భాగ్యలక్ష్మి,విద్య, నౌసింగ్ ,హాస్య, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.