వేద న్యూస్, వరంగల్:
వరంగల్‌కు చెందిన గొల్లపల్లి రమేశ్ థర్మకోల్‌తో అయోధ్య రామమందిరాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. విభిన్న కళాకృతుల తయారీలో దాదాపు 25 ఏండ్ల అనుభవం కలిగిన రమేశ్.. 20 రోజుల్లో రామమందిరాన్ని తయారు చేశారు.
అయోధ్యలోని రామమందిర కళాకృతిని అచ్చుదించినట్టుగా తయారు చేయడానికి శ్రద్ధ వహించి తయారు చేసినట్టు రమేశ్ పేర్కొన్నారు. ఈ కళాకృతి తయారీకి సామగ్రి సమకూర్చుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పట్టిందని పేర్కొన్నారు.
థర్మకోల్ అట్టలతోనే ఆకృతిని తయారు చేసినట్టు స్పష్టం చేశారు. రమేశ్ నైపుణ్యం చూసి స్థానికులు మెచ్చుకున్నారు. ప్రభుత్వం ఇలాంటి కళాకారులను గుర్తించి వారి సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.