• జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా కేఆర్ వీ నర్సయ్య 
  • మహిళా విభాగం అధ్యక్షురాలిగా ముక్కా మాధవి
  • యువజన విభాగం అధ్యక్షుడిగా తంగెళ్లపల్లి శ్యాంకిషోర్

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య మహా సభ జమ్మికుంట పట్టణ, యువజన, మహిళా కమిటీల ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, కొండ్లె మల్లికార్జున్, ఆగిరి వెంకటేశ్, ఉప్పల శారద, కాచం సుష్మ, ఎన్.సామ్రాజ్యలక్ష్మి, కన్న కృష్ణ, చందా రాజు, శివనాథుని శ్రీనివాస్, ఎలిమిల్ల రాజేంద్రప్రసాద్, యాద సతీశ్, బచ్చు భాస్కర్, తదితర రాష్ట్ర, జిల్లా బాధ్యులు హాజరయ్యారు.

పట్టణ అధ్యక్షుడిగా కేఆర్‌వీ నర్సయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ముక్కా మాధవి, యువజన విభాగం అధ్యక్షుడిగా తంగెళ్లపల్లి శ్యాంకిషోర్ వారి కార్యవర్గాలతో ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో చీఫ్ గెస్టుగా హాజరైన అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధులతో ఉప్పల్ భగాయత్ లో ఏర్పాటు చేయబోయే భవన నిర్మాణ, వైశ్య సంఘ సభ్యత్వాల పెంపు గురించి చెప్పారు.

అందరి సహకారంతో జమ్మికుంట భవన నిర్మాణం చేపడతా: కేఆర్ వీ నర్సయ్య

చందా రాజు మాట్లాడుతూ సంఘ పటిష్ఠత కోసం కృషి చేయాలన్నారు. జమ్మికుంట సంఘ భవన నిర్మాణం గురించి చర్చించారు. అధ్యక్షుడు కేఆర్‌వీ నర్సయ్య మాట్లాడుతూ తన పదవీకాలంలో అందరి సహకారంతో జమ్మికుంట భవన నిర్మాణం చేపడతానని, సంఘ సభ్యత్వాన్ని పెంచుతానని తెలిపారు.