వేద న్యూస్, వరంగల్:
నెక్కొండ మండలం అమీన్ పేట గ్రామ మాజీ సర్పంచ్ ముసిపట్ల రామక్క అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ ..శనివారం రామక్క మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హనుమంతరావు యాకయ్య, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ డెక్క, సాంబరాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు