వేద న్యూస్, శాయంపేట:

శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం ఏర్పాటుచేశారు .ఈ సమావేశం బిఆర్ఎస్వి నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య ,మహిళా జర్నలిస్టు లని కూడా చూడకుండ వారిపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని వారు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగించాలని రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రాబోయే కాలంలో విద్యార్థులు, యువకులు ,ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ఈటువంటి చర్యలు మానుకోవాలని లేని పక్షంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు .

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి సీనియర్ నాయకులు బెరుగు తరుణ్ గోపి ,కళాశాల అధ్యక్ష కార్యదర్శులు అభిలాష్ ,సిద్దు, శివకుమార్, ప్రశాంత్ ,వినయ్ ,వంశీ ,సాయి కృష్ణ తేజ, గణేష్, మున్ని ,నాని ,మేఘనాథ్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.