- సమ్మక్క సారక్క జాతర కమిటీ చైర్మన్ సురేశ్
వేద న్యూస్, హుజురాబాద్/కమలాపూర్:
కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామంలోని శ్రీ సమ్మక్క సారమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ జాతర కోసం వేలం పాటలు ఈ నెల 12న(సోమవారం) ఉదయం 11 గంటలకు కన్నూరు గ్రామపంచాయతీ వద్ద వేలంపాట వేయనున్నట్లు సమ్మక్క సారక్క జాతర కమిటీ చైర్మన్ నల్లాని సురేష్ తెలిపారు.
ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతరలో కోళ్లు, బెల్లం, కొబ్బరికాయలు , పుట్నాలు పేలాలు, సైకిల్ స్టాండ్, ఎదురు కోళ్లు కు సంబంధించి వేలం వేయనున్నట్లు తెలిపారు. కావున ఆసక్తి ఉన్నవారు వేలం పాటలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నట్లు స్పష్టం చేశారు.