వేద న్యూస్, జమ్మికుంట:

 

డిసెంబర్ 3, 1984 లో భూపాల్ లోని యూనియన్ కార్బైడ్ పురుగు మందు తయారీ కర్మాగారం నుండి మైక్ అనే విషవాయువు లీకేజీ కారణంగా దాదాపు 10 వేల మంది అమాయకులు అసువులుబాసారు. ఈ నేపథ్యంలో బుధవారం  భోపాల్ విషయాయువు విషాద దుర్ఘటనకు నివాళి గా “జాతీయ కాలుష్య నివారణ” దినోత్సవం లో భాగంగా శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం , కేశవపురము జమ్మికుంట విద్యార్థులు మురళి థియేటర్ జంక్షన్ నుండి గాంధీ చౌక్ వరకూ ర్యాలీ లో పాల్గొన్నారు.

 

కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు పోల్సాని సుధాకర్ రావు , సహ ప్రధానాచార్యులు పోతన శ్రీకాంత్ , పర్యావరణ ప్రముఖ్ జొన్నల రమేష్,సరస్వతీ శిశు మందిర్ ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్ , ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు.