•  బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్

వేద న్యూస్, ఆసిఫాబాద్:

బీసీ హాస్టల్ కు పక్క భవనం నిర్మించాలని బీసీ యువజన సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు . జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల బీసీ ప్రి మాట్రీక్ బాలుర వసతి గృహాన్ని ఆయన సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని , గత సంవత్సరం హాస్టల్ పై కప్పు రిపేర్ చేసినప్పటికీ ఎటువంటి ఫలితం పైకప్పు నుండి పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పారు. విద్యార్థులు ఇబ్బంది పడుతూ బిక్కుబిక్కుమని నిద్ర పోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

వర్షాలు నిర్విరామంగా కురుస్తున్న తరుణంలో పైకప్పు ఎప్పుడు కూలిపోయేది చెప్పలేమన్నారు. కాబట్టి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని దయచేసి నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు బొట్టుపల్లి సాయి కృష్ణ, పిప్పిరి సమన్న, సామాజిక కార్యకర్త కల్లూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.