వేద న్యూస్, ఆసిఫాబాద్:
కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు ఆధ్వర్యంలో 120 మంది యువకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ లో శుక్రవారం చేరారు.

ఈ సందర్బంగా ప్రణయ్ మాట్లాడుతూ విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు చేసే బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీలు,సంక్షేమ హాస్టళ్లు, మహాత్మ జ్యోతి బా పూలె రెసిడెన్షియళ్లతో విద్యార్థులకి మేలు జరుగుతుందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కోవ లక్ష్మి గెలుపుకోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ యువజన నాయకులు, యువకులు పాల్గొన్నారు.