వేద న్యూస్, వరంగల్ టౌన్:

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ వరంగల్ జిల్లా మీడియా ఇంచార్జ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ప్రాంతానికి చెందిన నాగపురి అవినాష్ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందికొండ మోహన్, ఆవునూరి కుమారస్వామి మంగళవారం అవినాష్ కు నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ పరంగా చేపడుతున్న కార్యక్రమాలలో అవినాష్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఇట్టి నియామకం చేపట్టినట్లు తెలిపారు.

భవిష్యత్తులో యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, నాగపురి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.