•  విద్యార్థినులకు జిల్లాస్థాయి ప్రైజ్ 
  •  అందజేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, ఎల్కతుర్తి:

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎల్కతుర్తి మోడల్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన నాటికకు హనుమకొండ జిల్లా స్థాయి అవార్డు లభించింది. మోడల్ స్కూల్ లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులు హింగే లక్కీ, బుస్సారి ప్రణీత, కుర్ర సింధుజ లు జాతీయ రహదారి భద్రత మాసో త్సవం సందర్భంగా నాటికను ప్రదర్శించారు. ఆ నాటికకు హనుమకొండ జిల్లా స్థాయి పోటీలో తృతీయ బహుమతి దక్కింది. తృతీయ బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు పొందిన విద్యార్థినులను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను స్టూడెంట్స్.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హనుమకొండ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం అందుకున్నారు. విద్యార్థినుల వెంట ఉపాధ్యాయురాలు రాజ్య శ్రీ ఉన్నారు.