వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి వెంకటేశ్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వెంకటేశ్ ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పరిశోధన చేశారు.

ఈ క్రమంలో వెంకటేశ్ కు అక్టోబర్ 31న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, అడోబ్ సీఈఓ (అమెరికా) శంతను నారాయణ్ శివరాత్రి సుధాకర్ కు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ కాశీం, ప్రొఫెసర్ సూర్యా ధనంజయ్, ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ, ప్రొఫెసర్ వారిజారాణి, డా. రఘు, డా. ఏలె విజయలక్ష్మి; తల్లిదండ్రులు శివరాత్రి లింగమ్మ, మల్లయ్య, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.