– ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తి రైతులకు సదస్సు
– షిన్వా మందు ఉపయోగాలపై ఎగ్జిక్యూటివ్ రవీందర్‌రెడ్డి వివరణ
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ట్రాక్టర్ బ్రాండ్ (ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్)కంపెనీ వారి కొత్త పురుగుల మందు షిన్వా వినియోగం, ఉపయోగాలపై రైతులకు కంపెనీ వారు అవగాహన కల్పించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామరైతు కుడుతాడి రమేశ్..పత్తివ్యవసాయక్షేత్రంలో బుధవారం జరిగిన అవగాహనా సదస్సుకు రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ కరీంనగర్ జిల్లా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏలూరి రవీందర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం పత్తిపంటలో వచ్చే తామర పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగుతో పాటు అన్ని రకాల పురుగుల నివారణకు షిన్వా అనే మందును ఉపయోగించాలని రైతులకు సూచించారు. ఆ మందు ఉపయోగాలను, వాడే విధానాన్ని ఫార్మర్స్‌కు సవివరంగా తెలిపారు. సాధారణంగా రైతులు పత్తి పంట గ్రోతింగ్, పూత, పేను దోమ, పురుగు నివారణకు సెపరేట్‌గా ఒక్కొక్క మందును వాడుతుంటారని..కాగా, షిన్వా అనే ఒకటే మందు వాడితే పత్తి పంటకు అది సర్వరోగనివారణిగా పని చేస్తుందని వెల్లడించారు. షిన్వా అనేది ఖర్చును తగ్గిస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఒక దఫా ఈ మందును వాడి తమ పంటలోని తామర పురుగులు, పచ్చ పురుగు, లద్దె పురుగులను నివారించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ షిన్వా మందు 160 ఎంఎల్ రూ.2,200కు లభిస్తుండగా, దానిని ఒక ఎకరానికి పిచికారీ చేయొచ్చన్నారు. గ్రామ రైతులు ఈ షిన్వాను వాడి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో షిన్వా మందు వాడిన రైతు కుడుతాడి రమేష్..మందు పిచికారీ తర్వాత తన పత్తి పంటలో వచ్చిన మార్పు, సత్ఫలితాలను తోటి రైతులకు చెప్పారు. కొత్తగా వచ్చిన షిన్వా అనే మందును తన పంటకు స్ప్రే చేసి 20 రోజులు అవుతోందని, ఇప్పుడు పంట చాలా బాగుందని తెలిపారు. తనకున్న 5 ఎకరాలలో 4 ఎకరాలకు ఈ మందు స్ప్రే చేయగా, పంటలో పెరుగుదల ఉందన్నారు. మందు అన్ని రకాలుగా పత్తి పంటకు పని చేసిందని, తనకు ఒకసారి మందు స్ప్రే చేసే శ్రమ కూడా తప్పిందని పేర్కొన్నారు. తను రెండు సార్లు పత్తి పంటకు మందు కొట్టేది ఒకటే సారి కొట్టడం షిన్వా మందు ద్వారా సాధ్యం అయిందన్నారు. పంట పురుగుల నివారణలో ఖర్చు తగ్గిందని, ఆదా అయిందని చెప్పారు. కాగా, ఈ సదస్సుకు వచ్చిన రైతులకు కంపెనీ వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామరైతులు సుకినె రాజేందర్, ఇరువాల శివాజీ, గువ్వాడి రాజేశ్వర్ రావు, కుడుతాడి రాములు, రాజు, చంద్రాకర్, చందర్ రావు, వాంకె రవీందర్, వలిగె సాంబయ్య, కోటి, దేవకారి బాలకిషన్, అంబీరు శ్రీనివాస్, నర్సింగం, ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్ జే.చంద్రమౌళి, ఫీల్డ్ స్టాఫ్ టీ.హరీష్, ఏ.రంజిత్ తదితరులు పాల్గొన్నారు.