వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ఆదర్శ మారుతీ సుజుకి డ్రైవింగ్ స్కూల్, వరంగల్ ట్రాఫిక్ పోలీస్ అద్వర్యం లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ ఏసిపి ఎం.బోజారాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థిలో ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని సూచించారు. విద్యార్థులకు రోడ్డుపై భద్రత అవగాహనా మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, ట్రిపిల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, వాహన పార్కింగ్ గురించి మొదలగు అంశాలను విద్యార్థులకు వివరించారు.
అనంతరం ఆదర్శ మారుతీ సుజుకి డ్రైవింగ్ స్కూల్ మేనేజర్ శ్యామ్ మాట్లాడుతూ రోడ్డుపై మనం ట్రాఫిక్ నిబంధనలను పాటించినప్పుడే రోడ్డు పైన మనకు భద్రత, భరోసా ఉంటుంది అన్నారు. మనం రోడ్లపైన వాహనం నడిపేటప్పుడు అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త వహించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈకార్యక్రమంలో సిఐలు సీత రెడ్డి,వెంకన్న,సుజాత, ఆదర్శ మారుతీ సుజుకి డ్రైవింగ్ స్కూల్ మేనేజర్ జన్ను శ్యామ్, ఫార్మసీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఫార్మసీ, విద్యార్థులు , ఫ్యాకల్టీ , డ్రైవింగ్ స్కూల్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.