వేద న్యూస్, కాజీపేట :
ఫూడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నేపథ్యంలో పై బుధవారం కాజీపేటలోని ఎఫ్సీఐలో అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎఫ్సీఐ డివిజనల్ మేనేజర్ ప్రఖార్ వర్మ హాజరై మాట్లాడుతూ విజిలెన్స్ అవేర్నెస్ నేపథ్యంలో ఆగస్టు నెల 16వ తేది నుంచి నవంబర్ 15వ తేది వరకు విజిలెన్స్ పై ప్రతి ఉద్యోగికి అవగాహన కల్పించేందుకు తగు కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎజీఎం సుస్మిత్ చక్రవర్తి, మేనేజర్లలు శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, దివ్య, మమాత, శైలజ, ధీరాజ్, ఇమ్రాన్, సుప్రియా, జగ్గు నాయక్, గ్రేడ్–3లు అనీల్ కుమార్, క్రాంతిక్, జగదీశ్వర్, ఐత రాజు, ఎఫ్సీఐ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.