వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలో అయోధ్య రాములోరి అక్షంతలు వితరణ కార్యక్రమం బుధవారంచేపట్టారు. రాములవారి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలోని 16 వ వార్డు, 10 వార్డ్ లో ఇంటింటికీ రామజన్మభూమి అక్షింతలు పంపిణీ చేశారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను రాములోరి కరపత్రాలను ప్రత్యేక పూజలు నిర్వహించి..రాముని ఫొటోను ప్రతీ ఇంట్లోకి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ సంయోజకులు జీడి మల్లేష్ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 15 వరకు అక్షింతలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 22న అయోధ్యలో శ్రీ బాల రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ప్రతి ఇంట్లో దీపావళి పండుగలా జరుపుకొని..సాయంత్రం సూర్యుడు అస్తమిం చిన తరువాత ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని కోరారు.
కార్యక్రమంలో నాయకులు జీడి మల్లేష్, పల్లపు రవి, శ్రీనిధి, ఇటికల స్వరూప, మోతే స్వామి, గండికోట సమ్మయ్య, తిరుపతి, శ్రీను, పల్లపు పృథ్విరాజ్, రాచర్ల రవి, రోజా, మహిపాల్, కృష్ణ, రజిత తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.