వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలో రాములవారి టెంపుల్ లో అయోధ్య రాములోరి అక్షింతలకు శనివరాం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మికుంట పట్టణంలోని 27వ వార్డు, 25 వార్డ్, 29 వ వార్డు లో ఇంటింటికీ పంపిణీ చేశారు.

జమ్మికుంట పట్టణ సంయోజకులు జీడి మల్లేష్, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ శీలం శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్యలో బాల రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ప్రతి ఇంట్లో దీపావళి పండుగలా జరుపుకొని..సాయంత్రం సూర్యుడు అస్తమిం చిన తరువాత ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని కోరారు.

కార్యక్రమంలో నాయకులు ఠాగూర్ రాజేష్, ఠాగూర్ రాకేష్, మోడం రాజు, బూరుగుపల్లి, రామ్ సదానందం, నాగపురి విజయ్, చిరంజీవి, కిరణ్, శ్రీనివాస్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.