వేద న్యూస్, ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని కుల సంఘాలు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, మన దేశానికీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చేసిన అందశప్రాయమైన సేవలను గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరo డిసెంబర్ 6న మహాపరినిర్వహణ దివస్ స్మృత్యoజలి జరుపుకుంటారు అన్నారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గొప్పతనం అయన బహుముఖ ప్రతిభ భారత రాజ్యాంగ నిర్మాత న్యాయవాది ఆర్థికవేత్త రాజకీయ నాయకుడు సంఘ సంస్కర్త దళిత మహిళా కార్మిక హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అన్నారు.
కుల వివక్ష నిర్ములనకు సామజిక సమానత్వానికి, అణగారిన వర్గాల సాధికారతకు తన జీవితాన్ని అంకితం చేశారు. రాజ్యాంగ “పితమహుడు”గా పేరు పొందారు అని చెప్పారు.అంతే కాకుండా అంటరానితనం కుల వివక్ష వంటి సామాజిక దూరా చారాలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు.
న్యాయవాదిగా ఆర్థికవేత్తగా దేశానికీ విశేష సేవాలాందించారు అని అన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావశాలురైనా మేధావులలో ఒకరిగా గుర్తింపు పొందారు. లండన్ విశ్వవిద్యాలయంలో తన పీహేచ్ డీ ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారు.
స్వాత్రంత్ర భారతదేశం మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా దేశానికి సేవలు అందించారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్యామల తుక్కారం, మాజీ యంపీటీసీ పొనకంటి చిన్న వెంకట్, మామిడి సురేష్ రెడ్డి, ,గుజ్జరి ప్రకాష్, బోయిని కరెన్న, తుమ్మల సామెల్, ఏ వై ఎస్ యూత్ సభ్యులు, కిషోర్,గణేష్, రాజేష్, రాకేష్,నరేష్, తిరుమలేష్, సంఘ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.