వేద న్యూస్ శాయంపేట:

శాయంపేట మండలం తహరాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బడుగు రవీందర్,అశోక్ సోదరి బడుగు రజిత ఇటీవల పరమపదించినారు. శుక్రవారం ఆమె దశదినకర్మ కార్యక్రమానికి పరకాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య హాజరై మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహరాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కుక్కల బిక్షపతి, కొమ్ముల సంతోష్,రేణికుంట్ల కుమారస్వామి, ధారంగుల చంద్రప్రకాష్,వల్లెపు దిలీప్ పాల్గొన్నారు.