వేద న్యూస్, రామడుగు:
రామడుగు మండలంలోని వెదిర వెంకటగిరి గ్రామంలో తయారు చేస్తున్న కొత్తపల్లి మాధవి, వడ్లూరి రాణి తయారు చేస్తున్న సందర్భంగా జ్యూట్ బ్యాగ్ ను కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి కి వెంకటగిరి లో అందజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ నివారణ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి జ్యూట్ బ్యాగ్ లను ప్రజలందరూ వాడి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా జ్యూట్ బ్యాగ్ లను కొనుగోలు చేయాలని తెలియజేశారు.