• ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్
  • బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ గెలుపు కోసం ప్రచారం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/వీణవంక:
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే దళితులు ఉన్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన వీణవంక మండలం కనపర్తి గ్రామంలో పాడి కౌశిక్ రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. బండ శ్రీనివాస్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కనపర్తి గ్రామంలో దళితవాడలో తిరిగారు. దళితులను ఏకం చేసి వారికి అందిన ప్రభుత్వ ఫలాలను గురించి వివరిస్తూ..వారిని ఓట్లు అభ్యర్థించారు. దళితులందరూ కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎం చేయాలని కోరారు. కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి, దళిత బంధు మండల కన్వీనర్ మొలుగురి ప్రభాకర్, వీణవంక మండల బీఆర్ఎస్ నాయకులు తాండ్ర శంకర్, పులి ప్రకాష్, జూపాక మాజీ సర్పంచ్ ఇల్లందుల శ్రీనివాస్, నాయకులు చంద్రమౌళి, మంద రాజేష్, తారక్ తదితరులు పాల్గొన్నారు.