- బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు చిరంజీవి ధీమా
వేద న్యూస్, ఎల్కతుర్తి:
కరీంనగర్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గెలుపు మరోసారి ఖాయమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు కుడుతాడి చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. బండి ఆదేశాల మేరకు మంగళవారం మండల పరిధిలోని దామెర గ్రామ బూత్ కమిటీ వెరిఫికేషన్ పూర్తి చేసినట్టు చిరంజీవి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా గ్రామ బూత్ కమిటీ కలిసి కట్టుగా పని చేయాలని బూత్ కమిటీ సభ్యులకు సూచించినట్టుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పల్లెపాటి మధుకర్, మంతుర్తి శ్రీకాంత్, శ్యామ్ సింగ్, రగొత్తం రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.