వేద న్యూస్, వరంగల్/కేయూ:
కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మన రాష్ట్రానిది అని ఈ సందర్భంగా అధ్యాపకులు తెలిపారు. విద్యార్థినులు చక్కగా బతుకమ్మలను పేర్చుకుని వచ్చి కాలేజీ ప్రాంగణంలో బతుకమ్మ ఆడారు.

బొడ్డెమ్మతో పాటు బతుకమ్మను పూజించే తెలంగాణ సంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవని పలువురు అధ్యాపకులు చెప్పారు. ఈ బతుకమ్మ సంబురాల్లో కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, అధ్యాపకులు, తూర్పాటి వెంకటేష్, కే.సాయి తరుణ్, వాణిశ్రీ, స్వప్న, సురేందర్ సాహితి, స్వాతి, వీణ, కిరణ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఏఆర్ ఆర్ వెంకటేశ్వర్లు, మల్లేశం,శంకర్, సంజయ్, యాదగిరి, రవి, తాజ్ బాబా, రమ, మమత తదితరులు పాల్గొన్నారు.