వేద న్యూస్, ఓరుగల్లు:
ములుగు రోడ్డులోని ఎల్బీ కాలేజీలో గురువారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఎన్సిసి విద్యార్థులు, ఎన్సీసీ కమాండో కెప్టెన్ డాక్టర్ ఎం.సదానందం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ ఎల్బీ కళాశాలలో బతుకమ్మ పండుగను ప్రతీ సంవత్సరం జరుపుకుంటామని చెప్పారు. స్త్రీలను గౌరవించే పద్ధతి ఈ పండుగలో ఎక్కువగా కనబడుతుందని చెప్పారు. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్సిసి క్యాడెట్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
