వేద న్యూస్, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరమని, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమమని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా, జరపైలంగా ఉండాలన్నారు.
వరద ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించరాదని, వర్షం వస్తున్నప్పుడు చెట్ల కింద ఉండరాదని చెప్పారు. వర్షంలో తడవడం, చిన్నపిల్లలు వర్షంలో ఆడకుండా చూసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, నియంత్రికలు, వైర్లు, మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి తడిసిన విద్యుత్ స్తంభాల సపోర్ట్ వైర్,విద్యుత్ ఉపకరణాలను తాకరాదని తెలిపారు.
బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ వైర్లు కలుపరాదని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్ధం వస్తే వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలన్నారు. వర్షాలు పడుతున్న వేళ వ్యవసాయ మోటార్లు ఆన్ చేయరాదని, వినాయక మండపాల వద్ద కూడా యువకులు తగు జాగ్రతలు పాటించాలని చెప్పారు.
గృహాల్లో అతుకులు లేని సర్వీసు వైర్ ను మాత్రమే ఉపయోగించాలని, తెగిపడిన,వేలాడుతున్న, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదని చెప్పారు. విద్యుత్ మరమ్మతుల కోసం సంబంధిత సిబ్బంది కి తెలియజేయాలన్నారు. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు పంపుసెట్లను, స్టార్టర్లను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు.
ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారికంగా ఫ్యూజులు మార్చడం, రిపేరు వంటివి చేయకూడదన్నారు. విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించి వాళ్ళ సేవలను పొందాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ వెల్లడించారు.