వేద న్యూస్, కాసిపేట:
శ్రీరాంపూర్ అమ్మ భగవాన్ సేవ సమితి, శ్రీరాంపూర్ సభ్యులు సమ్మన్న కూతురి పుట్టినరోజు పురస్కరించుకొని మానవతా సేవకు నిదర్శనంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీపూర్, సోనాపూర్ జెండగూడేం, పాత తిరుమలాపూర్ గ్రామాల పరిధిలోని కొలంలకు దుప్పట్లు అందజేస్తూ శీతాకాలంలో వారికి సహాయంగా నిలిచారు.ఈ కార్యక్రమాన్ని సమాజ సేవ కార్యకర్తలు ఎంబడి కిషన్, పాయిలి మల్లేష్, రాజమల్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి కొలంను సందర్శించి, అవసరమైన వారికి దుప్పట్లు అందిస్తూ సేవారాధనగా కార్యక్రమాన్ని చేపట్టడం స్థానికంగా ప్రశంసలు అందుకుంది.దుప్పట్లు పంపిణీ అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన సమ్మన్న ,
“వారిని కలవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నిజమైన సేవ అంటే ఇలాంటి కార్యక్రమాల్లో వారికి అవసరమైన సమయంలో తోడుగా ఉండడమే. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలనుకుంటున్నాను” అని తెలిపారు.అమ్మ భగవాన్ సేవ సమితి చేపట్టిన ఈ కార్యక్రమం పుట్టినరోజును ఒక సేవా సందర్భంగా మార్చి సామాజిక బాధ్యతను గుర్తుచేసిందని గ్రామస్థులు అభినందించారు.