వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మండల పరిధిలోని రంగమ్మపల్లి గ్రామంలో కురుమ కులస్తులు అంగరంగ వైభవంగా ఆదివారం బీరప్ప బోనాలు చేసుకున్నారు. డబ్బు సప్పుళ్లతో బోనాలు, నైవేద్యం సమర్పించారు. బీరప్ప బోనాలను వీధుల గుండా డప్పు సప్పులతో.. బీరప్ప దేవాలయం చేరుకుని గొర్రె పొట్టేళ్లను కోసి బోనాలను బీరన్నకు సమర్పించారు.
బీరప్ప దేవుని కుల దైవంగా పూజిస్తూ తొలి ఏకాదశి రోజున బీరప్పకు మొదట పండగల బోనాలు సమర్పిస్తామని కురుమ కులస్తులు వెల్లడించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు బాగుండేలా మమ్మల్ని చల్లగా చూడాలని ఆ దేవుని వేడుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కురుమ కులస్తులు ,మహిళలు పాల్గొన్నారు.

