- రెడ్యానాయక్ గెలుపు కోసం అంకుఠిత దీక్షతో పని చేస్తా
- బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త మాచర్ల భద్రయ్య ప్రతిన
వేద న్యూస్, మరిపెడ:
బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా మరోసారి గెలిచే వరకు తాను ‘‘మద్యం ముట్టను..మాంసం తినన’’ని మరిపెడ మున్సిపల్ కేంద్రానికి చెందిన మాచర్ల భద్రయ్య శనివారం శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో ప్రతిన బూనారు. సీఎం కేసీఆర్ అమలు చేయనున్న ఎన్నికల మేనిఫెస్టోను సీతారామాంజనేయులు ఆలయంలో దేవుడి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ సన్న బియ్యం, రూ.400 గ్యాస్ అందజేత, రైతు బంధు పెంపు, ఆసరా రూ.5016 తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుకు..బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి అండగా..ఓటరు దేవుళ్లు నిలవాలని కోరారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త అయిన భద్రయ్య ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గెలుపు కోసం ఇలా ప్రతిన బూనడం చూస్తుంటే ఆయనకు ఎమ్మెల్యే రెడ్యా పట్ల ఉన్న విధేయత అర్థమవుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా మరోసారి రెడ్యా గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.