వేద న్యూస్, వరంగల్ టౌన్ :

మొదటిసారిగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం

శ్రీ భద్రకాళి అమ్మ వారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ వరంగల్ బాధ్యులు బోళ్ళ అశోక్, పోతనేని రాజన్న, కుమార్, పెసరీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలా కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముదిరాజ్ కులస్తులు చాలా వరకు వెనుకబడి ఉన్నారని వారి అభ్యున్నతి కొరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ముదిరాజులకు అన్ని రిజర్వేషన్లలో సముచిత స్థానం కల్పించడంలో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.