వేద న్యూస్, వరంగల్ :
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానం హుండీలు లెక్కింపు జరుపగా) రూ|| 88,41,510=00 (అక్షరాల ఎనభై ఎనిమిది లక్షల నలభై ఒక్క వేయి ఐదు వందల పది రూపాయలు మాత్రమే) ఆదాయం సమకూరినది. అట్టి ఆదాయము యూనియన్ బ్యాంక్, కె.ఎం.సి బ్రాంచినందు జమచేయనైనది. విదేశీ కరెన్సీ 581 యూ.ఎస్.ఏ డాలర్లు, 20యు.ఏ.ఈ దిరమ్స్, 25 కెనడా డాలర్లు, 11 ఖతర్ సెంట్రల్ బ్యాంకు రియాల్స్, 20 యూరోలు, 13 మలేషియా రింగేట్స్, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 10 నేపాల్ రూపాయలు లభించారు. హుండీలో వెళ్ళినటువంటి మిశ్రమ బంగారం మరియు వెండి తిరిగి హుండీలో వేయనైనది. ఈ హుండీ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవాదాయ శాఖ పరిశీలకులు డి. అనిల్ కుమార్, దేవాలయ చైర్మన్ డా॥ బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు టి. వీరన్న, ఎన్. సుగుణ, ఎం. మయూరి, జి. స్రవంతి, ఓ. పూర్ణచందర్, బి. సతీష్, జె. వెంకటేశ్వర్లు, అనంతల శ్రీనివాసరావు, ఈ.ఓ & ఏ.సి శేషుభారతి మరియు ప్రధానార్చకులు భద్రకాళి శేషు మరియు శ్రీ లక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ మరియు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు మరియు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.