వేద న్యూస్, మరిపెడ:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో స్థానిక ప్రజా సంఘాల భవనంలో భారత యువజన ప్రజాతంత్ర సంఘం(DYFI) ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 వ జయంతి శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కోట శ్రీకాంత్ అధ్యక్షత వహించగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మధుసూదన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 27న పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడని అలాగే ఈ పేరు చెప్తే మనిషిలో నరనరాన భావోద్వేగం వస్తుందని, అతి చిన్న వయసులో దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి భగత్ సింగ్ అని చెప్పారు.
21 సంవత్సరంలో ఉరి తీయబడ్డ వ్యక్తి భగత్ సింగ్… ఉరి కంభం ఎక్కే ముందు ఉరి తాడును ముద్దాడిన వ్యక్తి అని, పొలంలో విత్తనాలు చల్లితే మొక్కలు వస్తాయి. పొలంలో తుపాకులు చల్లితే మళ్ళీ తుపాకులు మొలుస్తాయా అని అడిగిన వ్యక్తి భగత్ సింగ్…. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ పార్లమెంటుపై బాంబుల వేసిన వ్యక్తి అని వెల్లడించారు.
తాను ఉరితీయ తీసే కొద్దీ క్షణాల ముందు నీకేం కావాలి? అని అడిగితే ఒక పాకి పని చేసే అమ్మ చేత భోజనం వడ్డించుకుని తిన్న వ్యక్తి భగత్ సింగ్ అని వెల్లడించారు. 1928 లో లాడర్స నూ అధికారిని లాహోర్ లో కాల్చి చంపిన దాంట్లో భగత్ సింగ్ మొదటివాడు భగత్ సింగ్ అని చెప్పారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవ్ ముగ్గురు ఒకేరోజు ఉరి తీయబడ్డారని, ఈరోజు దేశ యువత భగత్ సింగ్ నూ ఆదర్శంగా తీసుకొని, నాటి భావి భారత పౌరులు, నూతన భారతదేశాన్ని నిర్మించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న, డివైఎఫ్ఐ మండల నాయకులు కోటా శ్రీకాంత్, పాగిండ్ల శీను సోమనబోయిన, పోడుపు గంటి వంశీ అక్కినపల్లి చింటూ, తమ్ముడబోయిన భార్గవ్, మూడు దయాకర్, రామ్ కుమార్ , శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు