వేద న్యూస్, ఆసిఫాబాద్ :
భారతీయ మరాఠా మహా సంఘ్ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్ల ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గార్గే, రాష్ట్ర యువ అధ్యక్షుడు బాజీరావ్ బొస్లే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సప్త శ్రీనివాస్ తెలిపారు.
జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎల్ములే దత్తు పటేల్, అధ్యక్షుడిగా అల్గం తులసిరామ్, ఉపాధ్యక్షుడిగా కిర్మరే శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శులుగా దంద్రే విలాస్, ఎల్ములే దీలిప్ పటేల్ ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో ఆర్డర్ కాపీని అందజేశారు. కార్యక్రమంలో సిర్పూర్ కాగజ్ నగర్ నియోజక వర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎల్ములే మనోహర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.