వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
హైదరాబాద్ లో సచివాలయంలోని తమ తమ చాంబర్లలో పలువురు మంత్రులను గురువారం భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(జీఎస్ఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వారికి పూల బొకేలు ఇచ్చి, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సత్తన్న వెంట భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజర్ల అశోక్, ఇస్లావత్ దేవన్, పిప్పాల రాజేందర్, మాచర్ల సంతోష్ తదితరులున్నారు.