వేద న్యూస్, హైదరాబాద్ :
నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న, భారత అణు శక్తి స్థాపకుడు, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు డా. ఏ.పి.జే అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్సీ మల్క కోమరయ్య ఘన నివాళులు అర్పించారు.
అనంతరం అబ్దుల్ కలాం దేశానికి, భారత రక్షణ రంగానికి చేసిన అపార సేవలను స్మరించుకున్నారు.