వేద న్యూస్, ఎల్కతుర్తి:
బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గకేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (జేఎస్ఆర్), నియోజకవర్గ నాయకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి చిరంజీవిని ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడికి సన్మానం
కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే మనప్ప వజ్జల్ కూడా చిరంజీవిని సన్మానించి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణరెడ్డి, నియోజకవర్గ ప్రభారి గుజ్జ సత్యనారాయణ, లక్కిరెడ్డి తిరుమల, నియోజకవర్గ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, కో కన్వీనర్ జనగాం వేణుగోపాల్ రావు, వివిధ మండలాల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం, బత్తుల శంకర్ బాబు, పైడిపల్లి పృధ్వీరాజ్, విరాచారి, కందుల శ్రీనివాస్ రెడ్డి, దుద్దెల లక్ష్మి నారాయణ, విద్యాసాగర్ రెడ్డి, ఎల్కతుర్తి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిలు, పల్లేపాటి మధుకర్, అరేపల్లి వినోద్, వైస్ ప్రెసిడెంట్ నార్లగీరి వెంకటేష్, కార్యదర్శి పెరుగు మధు, దళిత మొర్చా మండల అద్యక్షుడు పోగుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.