- ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్
వేద న్యూస్, మహేశ్వరం :
జల్ పల్లి మున్సిపాలిటీలో సమస్యలపై బీజేపీ ప్రశ్నించాకే మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పందించారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు.గురువారం జల్ పల్లి మున్సిపాలిటీలోనీ యువకులు బీజేపీలో చేరారు.అనంతరం శ్రీరామ్ కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థపై పోరాటం చేసింది బీజేపీ నేతలే అన్నారు. ఎంఐఎంతో కుమ్మక్కు కావటం వల్లే సబితమ్మకు మంత్రి పదవి, అసదుద్దీన్ అనుచరుడికి జల్ పల్లి ఛైర్మన్ పదవులు వచ్చాయని ఆరోపించారు. బీజేపీలో చేరుతున్న స్థానికులను మంత్రి సబితమ్మ తనయుడు కార్తీక్ రెడ్డి భయభ్రంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 3న బీజేపీ ఘన విజయం సాధించాక వడ్డీతోసహా ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలకు చెల్లిస్తామని అందెల శ్రీరాములు యాదవ్ హెచ్చరించారు.
డబుల్ బెడ్ రూమ్స్ స్థానికులకే ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ పోతేనే ఫించన్లు, నిరుద్యోగభృతి, ఉచిత విద్య, వైద్యం అందుతాయని చెప్పారు అందెల శ్రీరాములు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కపిల్ గౌడ్, కౌన్సెలర్లు శ్రీధర్ గౌడ్, బుడమల యాదగిరి, శాంతకుమార్, గొరిగె మల్లేశ్, నర్సింగ్ గౌడ్, దీలిప్ గౌడ్, మురళీ, సంతోష్, నాగార్జున, మనోజ్, హరికృష్ణ, సుమీత్, రాజేందర్ సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.