వేద న్యూస్, ఎల్కతుర్తి:
అందరూ కలిసికట్టుగా పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన అధ్వర్యంలో మండలంలోని సూరారం గ్రామంలో బూత్ స్వశక్తీకరణ కార్యక్రమంలో భాగంగా బూత్ కమిటీ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగురవేయాలని, ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిని మెజారిటీతో గెలిపించాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎగరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లేపాటి మధుకర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బిట్ల లింగయ్య, కిసాన్ మోర్చా నాయకులు పుట్ట కనకయ్య, శక్తి కేంద్ర ఇన్ చార్జి సింగనవేన రాజు, రమేష్, స్వామి, కిరణ్, మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.