వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి :
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ చౌక్ లో ఘనంగా పార్టీ జెండా ఎగరవేసి స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు దేశ మరియు ప్రపంచ లోనే అతిపెద్ద కార్యకర్తలు కలిగిన పార్టీగా బిజెపి ఎదిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందదాయకమని తెలియజేశారు. అనంతరం అల్లాడి రమేష్ మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజక వర్గ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సంటి మహేష్ రేగుల రాజు,పట్టణ ఉపాధ్యక్షులు అన్నం నరసయ్య, కన్వీనర్ బుర్ర మహేష్ గౌడ్, తడుక రాజు, రేగుల సంతోష్, బాబు,శ్రీకాంత్, శంకర్, లక్ష్మి రాజు, వైభవ్, బాలరాజు, బండ మల్లేశం,ఏ రెడ్డి రాజిరెడ్డి, చారి బూత్ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.