వేద న్యూస్, వరంగల్ జిల్లా :
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో 46వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా బిజెపి జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. అనంతరం వారు మాట్లాడుతూ..చిట్టచివరి పేదల సంక్షేమమే లక్ష్యంగా అంత్యోదయ విధానంతో ఏకాత్మక మానవతావాదం ఆచరణగా ఆర్థిక, సాంస్కృతిక జాతీయవాదమే సిద్ధాంతంగా సర్వస్ఫర్శి – సర్వవ్యాపిగా దేశవ్యాప్తంగా నలుమూలల విస్తరించి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా, దేశహితం కోసం పనిచేస్తున్న ప్రతియొక్క కార్యకర్తకి, నాయకులకు మరియు మద్దతుదారులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గట్టిగొప్పుల రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి, ఆవిర్భవ దినోత్సవ జిల్లా కో-కన్వీనర్ మిట్టపల్లి కపిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, మాచర్ల దీన్ దయాల్, పిఠపురం ఏకాంతం గౌడ్, ప్రచార కార్యదర్శి చంద్రమోహన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎర్రగోళ్ల భరత్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నోముల రతన్, 16వ డివిజన్ అధ్యక్షురాలు జలిగేపు ప్రసన్న రాంప్రసాద్, శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, బిజెపి నాయకులు అల్లి అజయ్, ముండ్రాతి వెంకటేశ్వర్లు, కందుకూరి శ్రీనివాస్, బోడకుంట్ల శివశంకర్ మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.