• ప్రజలను కోరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి
  • ప్రచారంలో దాసరికి ఘన స్వాగతం పలికిన ఎలిగేడు మండల ప్రజలు

వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గురువారం ఆయన ప్రచారంలో పాల్గొని ఇంటింట ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అందిస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.

ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేక పథకాలు బీఆర్ఎస్ సర్కార్ అందిస్తోందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. గ్రామంలో ప్రతీ ఒక్కరిని ‘అక్క, అన్నా, చెల్లి’ బాగున్నావా? అంటూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అప్యాయంగా పలకరిస్తూ..ప్రచారంలో ముందుకు సాగారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ మండిగా రేణుక రాజనర్సు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, గ్రామ నాయకులు మహేశ్వరరావు, ప్రసాద్ రావు, తిరుపతి, రాజేశం, రైతు సమన్వయ సమితి సభ్యులు వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.