- ప్రతి ఇంటికి ఒక రక్తదాత తయారవ్వాలి:సైదులు
వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి :
అనుముల మండలం హలియాలో సుమంగల్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం తల సేమియా బాధిత పిల్లల కోసం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో కొత్తపల్లి సైదులకు రక్తదాత సుఖీభవ అవార్డును ప్రదానం చేసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రక్తదానం చేస్తూ,తన మిత్రులతో,తెలిసిన రక్తదాత సోదరులతో రక్తదానం చేయించినందుకు గాను గుర్తింపుగా రక్తదాత సుఖీభవ అవార్డును ప్రధానం చేయడం జరిగిందన్నారు.ఈ అవార్డు రావడంతో నాపై మరింత బాధ్యతను పెంచిందని,నాతోపాటు చుట్టుప్రక్కల ఉన్న ప్రతీ ఒక్కరికి రక్తదానం పట్ల అవగాహన కల్పిస్తానని,అత్యవసర సమయంలో రక్తం తక్కువయ్యి చనిపోకుండా కాపాడతానని, ప్రతి ఇంటికి ఒక రక్త దాత తయారు కావాలని కోరారు.
ఈ అవార్డులను అందజేసిన అమిర్ ఆలీ ఫౌండేషన్ చైర్మన్ అమిర్ ఆలీ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రారంభించారు,వారి చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేయడం జరిగింది.
ప్రముఖ సామాజిక వేత్త శంషాబాద్ సిద్దు రెడ్డి చేతుల మీదుగా నటుడు ఇంద్రసేన (ఫిల్మ్ హీరో) మరియు డా. మునిర్ తదితర ప్రముఖులు పాల్గొనగా వారి చేతులమీదుగా రక్తదాతలను సన్మానించడం జరిగింది.
