- ఇందిరానగర్‌ను దత్తత తీసుకుంటా
- బీజేపీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే..ఇందిరానగర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని బీజేపీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హామీనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి ఆయన ఎల్కతుర్తి మండలానికి సోమవారం వచ్చారు. మండల పరిధిలోని ఇందిరానగర్, గోపాల్ పూర్, జగన్నాథ్ పూర్, జీలుగుల, పెంచికల పేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే అసమర్థత వల్లే నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని విమర్శించారు.బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వివరించారు. తాను స్థానికుడినని, హుస్నాబాద్ ప్రజానీకాని ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. గతంలో నాయకులు తీసుకున్న మాదిరిగా కాకుండా తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే తను ఇందిరానగర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే నియోజకవర్గ పరిధిలో బెల్ట్ షాపులను బంద్ చేపిస్తానని వెల్లడించారు. బెల్ట్ షాపుల వల్ల మహిళలు ఇబ్బందుపడుతున్నారని, ఈ విషయం తనకు ఒక వృద్ధురాలు చెప్పిందని స్పష్టం చేశారు.
ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండరని ఆరోపించారు. తాబేదారులకు మాత్రమే మేలు చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే సతీశ్ ఇల్లు హన్మకొండలో, సింగపురంలో ఉందని, ఆయన స్థానికుడు కాదని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజానీకం తనకు ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని జనాన్ని కోరారు. బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేయలేదని చెప్పారు. ‘డబుల్’ ఇండ్లు, బీసీ బంధు, దళిత బంధు వంటి పథకాలు ఎల్కతుర్తి మండలంలోని ప్రజలందరికీ అందలేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తిరుమల, వీరాచారి, ప్రశాంత్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
