వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి:
మిర్యాలగూడ పట్టణంలోని విద్యానగర్ కాలనీ వరసిద్ధి వినాయక దేవాలయంలో బుధవారం భాషా ప్రవీణ వారణాసి ఆంజనేయులు రచించిన సామెతలతో హితబోధ శతకము పుస్తకావిష్కరణ ఈ కార్యక్రమం కవులు,కళాకారులు,తెలుగు భాష ప్రవీణుల,పండితుల హర్షద్వానాల మధ్యన జరిగింది.
సామెతలతో పద్యాలనేది ఎవరు చేపట్టని కొత్త ప్రక్రియగా తేలికైన పదాలతో 102 సామెతలతో చక్కటి పద్యాలను ఆటవెలదిలో రచయిత రాసినట్లు కార్యక్రమ అధ్యక్షులు అష్టావధాని శ్రీ కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృగశిర కార్తె పూర్ణిమలో ఏరువాక సాగుతున్నట్లుగా సామెతలతో హితబోధ శతకం అజరామర కీర్తిని పొందినట్లు వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు తడకమళ్ళ రామచంద్రరావు,తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపకులు పులి కృష్ణమూర్తి శర్మ,వారణాసి కోటేశ్వర శర్మ, శ్రీధర శర్మ,నందికొండ చంద్రయ్య,పుల్లభట్ల లక్ష్మీనారాయణ శర్మ,లక్ష్మీ నరసయ్య,కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
