వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:

సిరిసిల్ల పట్టణంలోని ఇందిరనగర్ కు చెందిన ఆటో కార్మికుడు ఎర్రం బాలయ్య మంజుల దంపతుల రెండవ కుమారుడు అశ్విన్ సర్దాక్ (5) విష జ్వరంతో బాధపడుతూ ఉండటంతో పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదించారు. అది చూసి అక్కడున్న వారు సైతం కన్నీరు పెట్టుకున్నారు.

ప్రస్తుతం వర్షాకాల సమయం కావడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి విష జ్వరాల బారిన పడకుండా కంటికి రెప్పల కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.