• ఇంపాక్ట్ ట్రెయినర్ అన్నం ప్రవీణ్

వేద న్యూస్, జమ్మికుంట:

ఇంపాక్ట్ ‘ట్రెయిన్ ది ట్రెయినర్-138 బ్యాచ్’ శిక్షణా కార్యక్రమం ద్వారా తాను ఎన్నో విషయాలను తెలుసుకున్నానని ఇంపాక్ట్ ట్రెయినర్ అన్నం ప్రవీణ్ తెలిపారు. ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఆది నారాయణ రెడ్డి అధ్వర్యంలో ‘ట్రెయిన్ ది ట్రెయినర్-138 బ్యాచ్’ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది.

ఈ ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్నారు. కాగా, ట్రైనింగ్ లో భాగంగా అటెండెన్స్, అసైన్మెంట్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ట్రైనింగ్ పూర్తైన సందర్భంగా మంగళవారం ప్రవీణ్ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న నేర్చుకున్న విషయాలను ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులకు చెబుతానని స్పష్టం చేశారు. వారు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచేటట్లు, వారు మానసికంగా ఒత్తిడికిలోను కాకుండా చదువులో అభివృద్ధి చెందేటట్లు కృషి చేస్తానని వెల్లడించారు.

ముఖ్యంగా సర్కారీ స్కూళ్లు, కాలేజీల స్టూడెంట్స్ లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారు భవిష్యత్తులో ఏది సాధించాలనుకుంటున్నరో దానిపై అవగాహన కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేందుకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ద్వారా తమ వంతు కృషి చేస్తానని అన్నం ప్రవీణ్ పేర్కొన్నారు.

‘TRAIN THE TRAINER-138 Batch’ పూర్తైన క్రమంలో తన విజయానికి సహకారం అందించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావుకు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆది నారాయణ రెడ్డికి, ఇన్ చార్జులు బ్రహ్మానంద, కిషోర్ రెడ్డి, కో- ఆర్డినేటర్స్ ఛక్రి, రవీంద్ర, మెంటర్స్‌కు అన్నం ప్రవీణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.