ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి :

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే,జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, గురుకులాల మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మల్లాపూర్ మండలంలో వేలాదిమంది కార్యకర్తలతో ర్యాలీగా తరలి బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి నీరాజనం పలుకుతున్నారని, తెలంగాణ దొంగల పాలయింది. ఎప్పుడు ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ దరిద్రం వీడుతుందో అని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. స్థానికల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రామ గ్రామాన విజయ దుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్యాయమైందని రేవంత్ రెడ్డి తొడగొట్టి అంటే కేటీఆర్ అన్ని ఆధారాలతో ప్రెస్ క్లబ్ కి వెళితే రేవంత్ రెడ్డి తోక ముడిచిండని అన్నారు. కాంగ్రెస్ కు పాలించే సత్తా లేదని అర్థమైందని అన్నారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి మంగళారతులతో నీరజనం పలుకుతున్నారని అన్నారు. దురదృష్టవశత్తు బిజెపి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజలను,రైతులను కష్టాల పాలు చేస్తుందని అన్నారు.డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బిజెపి డ్రామాలాడుతుందని నిధులన్ని గుజరాత్ కు మళ్ళిస్తుందని అన్నారు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.