- దాసరి గెలుపునకు కౌన్సిలర్ గొట్టం లక్ష్మి, గులాబీ పార్టీ నేతల కృషి
వేద న్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో కౌన్సిలర్ గొట్టం లక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గొట్టం లక్ష్మి మంగళవారం ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరించారు. దాసరి మనోహర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా కంటిమీద కునుకు లేకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ దాసరి మనోహర్ రెడ్డినీ అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం పని చేస్తోందని వెల్లడించారు. ప్రజాక్షేమమే గులాబీ పార్టీ ధ్యేయమని, గులాబీ జెండా పేదలకు అండ అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో నాయకులు గొట్టం మహేష్, గోట్టం శ్రీనివాస్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.