•  నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దాసరిని గెలిపించండి
  • ప్రజలకు బీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి సతీమణి పుష్పలత అభ్యర్థన

వేద న్యూస్, ఎలిగేడు:
ఎలిగేడు మండల పరిధిలోని సుల్తానాపూర్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. శనివారం చేపట్టిన ‘గడప గడపకు బీఆర్ఎస్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సతీమణి దాసరి పుష్పలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి దాసరిని గెలిపించాలని జనాన్ని కోరారు. కారు గుర్తుకే ఓటు వేసి మనోహర్ రెడ్డిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.

సుల్తానాపూర్ మహిళలు మంగళ హారతులతో పుష్పలతకు ఘన స్వాగతం పలికారు. రానున్న రోజుల్లో వృద్ధులకు పెన్షన్ పెంపు, రైతులకు ‘రైతుబంధు’ పెంపు వంటి కార్యక్రమాలను పుష్పలత అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ప్రచారంలో జడ్పిటిసి బండి రేణుక రాజనర్సు, ఎంపీపీ తానుపర్తి స్రవంతి మోహన్ రావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, కే డి సి సి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, రాజేశం, సమ్మయ్య, సంజీవరావు, శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, కొమురయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.