- బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
వేద న్యూస్, రాజాపూర్:
బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం రాజాపూర్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు.ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి జడ్చర్ల అభివృద్ధి ప్రదాత బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు లింగం ముదిరాజ్ ప్రజలను కోరారు.బిఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.జడ్చర్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.